అమెరికాలో భారత్ విద్యార్థి మృతి
- September 03, 2017
వాషింగ్టన్: భారతదేశానికి చెందిన 22ఏళ్ల గగన్‌దీప్ సింగ్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి అమెరికాలోని వాషింగ్టన్‌లో హత్యకు గురయ్యాడు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న గగన్‌దీప్ ట్యాక్సీ డ్రైవర్‌గానూ పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన ట్యాక్సీలో ఎక్కిన 19ఏళ్ల యువకుడు గగన్‌దీప్‌ను కత్తితో పొడిచి హత్య చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి జాకబ్ కోలీమెన్‌గా అధికారులు గుర్తించారు. ఆగస్టు 28న వాషింగ్టన్‌లోని స్పోకనే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద కోలీమెన్ అనే యువకుడిని గగన్‌దీప్ తన ట్యాక్సీలో ఎక్కించుకున్నాడు. యూనివర్సీటిలో చదువుకునేందుకు సీటు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న కోలీమెన్ ఆ కోపాన్నంతా గగన్‌దీప్‌పై చూపించి అతన్ని హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గగన్‌దీప్ 2003 నుంచి అమెరికాలో నివాసం ఉంటున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







