కార్న్ అండ్ చీజ్ టోస్ట్
- September 03, 2017కావలసిన పదార్థాలు: వేగించిన బ్రౌన్ బ్రెడ్ స్లైసులు- 6, ఉడికించిన మొక్కజొన్న గింజలు- 1 కప్పు, చీజ్ తురుము- 2 టేబుల్ స్పూన్లు, వెన్న- 1 టేబుల్ స్పూను, ఉల్లిపాయ, క్యాప్సీకం, టొమేటో తరుగు - 1/4 కప్పు చొప్పున, ఆవపొడి- 1/4 టీ స్పూను, మిరియాలపొడి- 1/2 టేబుల్ స్పూను, పాలు- 1/2 కప్పు, మైదా- 1 టీ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా.
తయారీ విధానం: వెన్నలో ఉల్లిపాయ ముక్కలు రెండు నిమిషాలు వేగించాలి. తరువాత మైదా వేసి కలిపి సన్నని మంటపైన ఐదారు సెకన్లు ఉడకనివ్వాలి. ఇప్పుడు పాలుపోసి చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. క్యాప్సీకం ముక్కలు, మొక్కజొన్న గింజలు, టొమేటో ముక్కలు, చీజ్, ఆవపొడి, ఉప్పు, మిరియాల పొడివేసి ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. ఈ పదార్థాన్ని బ్రెడ్ స్లైసుల మీద వేసుకుని టమోటో సాస్‌తో తింటే బావుంటుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ