అగ్ని ప్రమాద ఉల్లంఘనలకు పాల్పడిన 309 నిర్మాణ యజమానులకు జరిమానా
- September 04, 2017
అబుదాబి: అబుదాబి సివిల్ డిఫెన్స్ ఈ ఏడాది 13,764 తనిఖీలు జరిపిన తరువాత ప్రజా భద్రత, అగ్నిమాపక నియమాలను ఉల్లంఘించినందుకు 309 భవనాలు, పలు నిర్మాణాల యజమానులకు జరిమానా విధించారు. గత ఏడాది 18,419 తనిఖీలు తరువాత గత ఏడాది సైతం 563 సంస్థలకు నాడు పౌర రక్షణ జరిమానా విధించింది.అగ్నిమాపక భద్రతా అవగాహన పెంచుకోవడానికి గతం కంటే ప్రస్తుతం నెమ్మది నెమ్మదిగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పౌర రక్షణ అధికారులు తెలిపారు. అగ్నిమాపక విషయంలో అవగాహన పెంపొందించేందుకు అగ్నిమాపక భద్రత మరియు జాగ్రత్తలు గురించి 2015-16లో అయిదు లక్షల కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా అబుదాబి విమానాశ్రయాల వద్ద ప్రయాణించే ఒకటిన్నర లక్షల మంది (1.5 మిలియన్ ) మంది ప్రయాణీకులు అగ్ని భద్రతా సమస్యల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ సంవత్సరం 85,000 మందికిపైగా ప్రజలకు అవగాహన కల్పించారు. షాపింగ్ మాల్స్ మరియు నివాస అపార్ట్మెంట్లలో కార్మిక వసతిలో ఉన్నవారికి అగ్నిప్రమాదం జరిగినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేసారు. గత ఏడాది అగ్నిప్రమాదం జరిగినపుడు 50 వేల మంది ప్రజలు తొలుత అబూ ధాబీ సివిల్ డిఫెన్స్ కు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. , ప్రజల జీవితాలను కాపాడుకోవడం, అబుదాబీ ఎమిరేట్‌లో అన్ని భవనాలు, నిర్మాణాల వద్ద భద్రతా నియమాలను వారు పాటిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. " నివాస మరియు వ్యాపార సంస్థల మధ్య నివసించే వారి నివాస భద్రత మరియు రఖ్క్షణ గురించి నిరూపణలు మరియు ప్రజా విశ్వాసాన్ని కల్గించాలని కోరింది." పౌర రక్షణ శాఖ గత ఏడాది 11,241 యాదృచ్ఛిక పరీక్షలు నిర్వహించారు, ఈ ఏడాది ఇప్పటివరకు 9,925 సంస్థలను అధికారులు తనిఖీ చేశారు.
తాజా వార్తలు
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!







