హత్య కేసులో వ్యక్తి అరెస్ట్ ..మృతదేహం నూతిలోనికి విసిరివేత

- September 11, 2017 , by Maagulf
హత్య కేసులో వ్యక్తి అరెస్ట్ ..మృతదేహం నూతిలోనికి  విసిరివేత

మస్కట్  : ఆసియా దేశానికి చెందిన ఓ నిందితుడు హత్య చేయడమే కాక మృతదేహాన్ని పాడుబడిన నూతిలోనికి విసిరివేశాడని రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ ఓ పి) వెల్లడించింది, హంతకుడు తన నేరంను కప్పిపుచ్చుకునేందుకు విలాయట్ లోని మహ్దా లో ఎవరూ ఉపయోగించని బావిలోనికి చనిపోయిన శవాన్ని పడవేసినట్లు ఒక ఆర్ ఓ పి అధికారి తెలిపారు. విచారణ మరియు నేర పరిశోధన విభాగానికి ప్రాతినిధ్యం వహించిన ఆల్ బరియామ్ పోలీసులు ఆ హత్య కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. సెప్టెంబరు 3 వ తేదీన ఒక వ్యక్తి అదృశ్యం కావడం గురించి ఒక పిర్యాదు అందుకొన్న తర్వాత ఈ కేసుని పరిశోధించేందుకు ఒక బృందం ఏర్పడింది. ఈ నేరంతో సంబంధం ఉండవచ్చనే ఒక అనుమానంతో ఆసియా దేశానికి చెందన ఓ వ్యక్తిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నించడం జరిగిందని దాంతో ఆ అనుమానితుడు తానే ఆ హత్య చేసినట్లు అంగీకరించాడని రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు తేలిపారు.అనుమానితుడు హత్య చేసిన తర్వాత మృతదేహాన్నిబావి లోనికి తోసివేసినట్లు దర్యాప్తు బృందంకు తెలిపాడు. కాగా చనిపోయిన వ్యక్తి  శరీరంపై  కత్తులతో పొడిచినట్లు పలు గాయాలను గుర్తించినట్లు పోలీసులు  తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com