ఎమిరేట్స్‌ ఎకానమీ: భారత్‌, పాకిస్తాన్‌లకి మరో 10 కిలోల బ్యాగేజీ

- September 11, 2017 , by Maagulf
ఎమిరేట్స్‌ ఎకానమీ: భారత్‌, పాకిస్తాన్‌లకి మరో 10 కిలోల బ్యాగేజీ

ఎంపిక చేసిన కొన్ని డెస్టినేషన్స్‌ కోసం దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్‌ విమానయాన సంస్థ తమ ప్రయాణీకులకు లగేజ్‌ విషయంలో కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఈ కొత్త వెసులుబాటు ప్రకారం అదనంగా 10 నుంచి 15 కిలోల బ్యాగేజ్‌ని తీసుకెళ్ళే అవకాశం ఉంది. అబిదజాన్‌, అక్రా, దకర్‌, ఎటెబ్బె, హరారే, లాండా, లాగోస్‌, లుసాకా, మనీలా, కైరో, కసాబ్లాంకా, నైరోబీ, అడ్డిస్‌ అబాబా, అల్జీర్స్‌ గువాంగ్జో మరియు డార్‌ ఎస్‌ సలామ్‌ తదితర ప్రాంతాలకు 15 కిలోల్ని అదనంగా ఎమిరేట్స్‌ విమానాల్లో ప్రయాణీకులు తీసుకెళ్ళే వీలుంది. అమ్మాన్‌, ఇస్లామాబాద్‌, కాబూల్‌, ఖార్తౌమ్‌, లాహోర్‌, ముల్తాన్‌, సియాల్‌కోట్‌, ట్యునీషియా, పెషావర్‌ ప్రాంతాలకు 10 కిలోలు అదనం తీసుకెళ్ళొచ్చు. కరాచి, ఢాకా, షల్హెట్‌, చిట్టగాంగ్‌, ముంబై, కోచి, ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నయ్‌, జకార్తా, సెబు, క్లార్క్‌ మరియు కొలంబోలకు 10 కిలోల బ్యాగేజీని ఎంపిక చేసిన విమాన సర్వీసుల్లో తీసుకెళ్ళడానికి వీలుంది. సెప్టెంబర్‌ 30 లోపు అమ్ముడయ్యే టిక్కెట్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ టిక్కెట్లతో డిసెంబర్‌ 13 వరకు ప్రయాణం చేయొచ్చు. స్కైవార్డ్స్‌ మెంబర్స్‌కి ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ సరికొత్త ఆఫర్లను అందిస్తోంది. సిల్వర్‌ మెంబర్స్‌ 12 కిలోలు, గోల్డ్‌ మెంబర్స్‌ 16 కిలోలు, ప్లాటినం మెంబర్స్‌ 20 కిలోలను అదనంగా తీసుకెళ్ళవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com