'మహానటి'లో కలక్షన్ కింగ్ మోహన్‌బాబుకి అవకాశం
- September 16, 2017
ఎంత పెద్ద డైలాగ్ అయినా ఏకధాటిగా చెప్పగల నటులు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా గుర్తొచ్చేది అలనాటి మహానటుడు ఎస్వీ రంగారావుగారు, ఎన్టీఆర్‌లు ముందువరసలో ఉంటారు. వారి తరువాత అంతటి పేరు సంపాదించుకున్న నటుడు కలక్షన్ కింగ్ మరియు డైలాగ్ కింగ్ అని పిలుచుకునే మోహన్ బాబు మాత్రమే. అందుకే మహానటి టీమ్ ఎస్వీరంగారావు పాత్రకోసం మోహన్ బాబుని ఎంపిక చేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించగా, ఇంకా చాలా మంది ప్రముఖ నటీనటులే ఈ చిత్రంలో నటిస్తున్నారు. నిజానికి సావిత్రికి, ఎస్వీరంగారావుగారికి చాలా అనుబంధం ఉండేదట. ఆమహానటుడ్ని సావిత్రి నాన్నా అని ఆప్యాయంగా పిలుచుకునేదట. ఎస్వీకూడా సావిత్రిని కన్నకూతురిలాగే చూసేవారట. ఈ అనుబంధం తెరపై పండాలంటే మోహన్‌బాబు సరిగ్గా సరిపోతారని భావించినట్లుంది మహానటి టీమ్. అందుకే అంతటి మహా అవకాశాన్ని మోహన్‌బాబు కాదనకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్నుంచి మోహన్‌బాబు కూడా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. మెయిన్ కారెక్టర్స్ అందరూ మహామహులే ఉన్న ఈ 'మహానటి' సినిమా ప్రేక్షకులకు విందుభోజనం అందించబోతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







