ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వాణీ విశ్వనాధ్ ఎంట్రీకి అంతా రెడి
- September 16, 2017
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి సినీ నటి వాణి విశ్వనాధ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. తన తండ్రి జ్యోతిష్యం చూసి చెప్పారని. రాజకీయాల్లో తాను రాణించే అవకాశముందని ప్రస్తావించారని చెబుతోందా అమ్మడు. 13 ఏళ్ల వయసుకే సినిమాల్లోకి అడుగు పెడతానని ఆమె పుట్టినప్పుడే చెప్పారట తండ్రి. ఇప్పుడు అదే మాట చెప్పారని గుర్తు చేస్తోంది. నగరి నుంచి పోటీకి దిగి రోజాకు చెక్ పెడుతుందనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో వాస్తవం ఏంటనే విషయంపై వాణి విశ్వనాధ్ మాట్లాడారు. సి.ఎం చంద్రబాబునాయుడు రాముడు. నేను ఉడుతలా ఆయనకు సాయం చేసేందుకు సిద్దమయ్యాను. తెలుగు ప్రేక్షకులకు సేవలందించాలనే తపనతోనే ఇక్కడకు వచ్చాను. ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తాను. అంతే తప్ప.. అది నగరినా.. మరొకటినా అనేది సంబంధం లేదు. రోజా మంచి నటి.
రాజకీయాల్లో వ్యక్తి పాత్ర కంటే. పార్టీలు, సిద్ధాంతాలే ప్రాముఖ్యతనిస్తాయి. నేను రోజాకు వ్యతిరేకం కాదు. కానీ ఆమె పోటీ చేసే పార్టీని ఓడించాలనేది నా ఆలోచన.
సి.ఎం చంద్రబాబు ఏం చెబితే అదే చేస్తాను. పదవులు ఆశించి రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు. త్వరలోనే చంద్రబాబును కలుస్తాను. అందరికీ విషయం చెబుతాను.
రాజకీయాల్లోకి వచ్చేది నిజం. పోటీ చేసేది అంత కంటే వాస్తవం. ఎవరి మీద పోటీ అనేది పార్టీ నిర్ణయిస్తుందని మనసులో మాట చెప్పారు వాణి విశ్వనాధ్.మళయాలంలో పుట్టి, తెలుగులో నటించి.. తమిళనాడులో స్థిరపడిన వాణి విశ్వనాధ్ మళయాళీ నటుడు బాబురాజ్ ను వివాహం చేసుకుంది.
వారికి ఒక ఉన్ని అర్చ అనే కుమార్తె ఉంది. చైన్నైకి దగ్గరగా ఉంటుందనే కారణంతోనే నగరిలో పోటీ చేయాలనే ఆలోచన.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







