ఫేక్ గోల్ట్ ట్రేడర్స్ గుట్టు రట్టు
- September 19, 2017
అబుదాబీ: అబుదాబీ పోలీసులు, 27 ఇలోల ఫేక్ గోల్డ్ జ్యుయెలరీని లోకల్ మార్కెట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అంతర్జాతీయ ట్రేడ్ మార్కెట్‌తో ఈ జ్యుయెలరీని రూపొందించారని పోలీసులు చెప్పారు. మొత్తం 26 జ్యుయెలరీ షోరూమ్‌లు ఈ కమర్షియల్ ఫ్రాడ్‌లో భాగం పంచుకున్నాయని వారు వివరించారు. వీటిల్లో 11 ఔట్లెట్స్ ఒకే వ్యక్తికి చెందినవి. అయితే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాల్ని మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ - అబుదాబీ పోలీస్ బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ రషీద్ మొహమ్మద్ బోరాషీద్ మాట్లాడుతూ, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ నకిలీ జ్యుయెలరీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గోల్డ్ మార్కెట్లో కమర్షియల్ ఫ్రాడ్‌కి సంబంధించి ఇంటర్నేషనల్ కమర్షియల్ ఏజెంట్ ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలను నిర్వహించి ఈ ఫ్రాడ్‌ని వెలికి తీశారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









