రాంగోపాల్ వర్మ కు కోర్టు షాక్..అరెస్టుకు ఆదేశం..
- September 19, 2017నిత్యం వివాదాలలో నడిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు , ఇన్నాళ్ళకి అడ్డంగా దొరికారా ? ఇక ఆయన ని అరస్ట్ చెయ్యక తప్పదా ? పోలీసులు ఆ పనిమీదనే ఉన్నారా ? అవును అనే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. తాజాగా ఆయన తీసిన వంగవీటి సినిమా కి సంబంధించి వివాదం రేగిన సంగతి తెలిసిందే.
వంగవీటి రంగా జీవితం మీద సినిమా తీసిన ఆయన ఆ సినిమా ద్వారా రంగా గొప్పతనం కాకుండా నెహ్రూ కి కొమ్ము కాశారు అంటూ సినిమా పూర్తి ఐన తరవాత చాలా మంది ఆరోపించారు.
అప్పట్లో సినిమా షూటింగ్ టైం లోనే వంగవీటి రంగా కొడుకు వంగవీటి రాధా వర్మకి కొన్ని విషయాలు పరిగణ లోకి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేసారు. దాన్ని వర్మ మినిమం కూడా కేర్ చెయ్యలేదు.
ఇష్టం వచ్చినట్టు సినిమాని తీసేసారు . సో తన తండ్రి నీ తన ఇంటి పేరు నీ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు అని వంగవీటి రాధ సీరియస్ అయ్యారు. ఇదే విషయం తో తల్లి తో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయస్థానం రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్