అవసరమైతే ఉత్తరకొరియా సర్వనాశనం, సహనం పరీక్షించొద్దు: ట్రంప్ తీవ్ర హెచ్చరిక

- September 20, 2017 , by Maagulf
అవసరమైతే ఉత్తరకొరియా సర్వనాశనం, సహనం పరీక్షించొద్దు: ట్రంప్ తీవ్ర హెచ్చరిక

- అవసరమైతే ఆ పనికి వెనుకాడబోమని హెచ్చరిక 
- ఐక్యరాజ్యసమితిలో తొలిసారి ప్రసంగించిన అధ్యక్షుడు 
ఉ.కొరియాపై అమెరికా అధ్యక్షుడు మరోమారు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధానికి కాలుదువ్వారు. ''అవసరమైతే ఆదేశాన్ని సర్వనాశనం చేస్తాం'' అని నిప్పులు చెరిగారు. కొరియా లాంటి దేశాలు భూగ్రహానికి ఉపద్రవంలా మారాయని, ప్రపంచదేశాల నేకాక సొంత ప్రజలను కూడా ఆ రాకెట్‌మ్యాన్‌(కిమ్‌ జోంగ్‌ ఉన్‌) ఇబ్బందులు పెడుతున్నాడని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం తొలిసారిగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. క్షిపణి పరీక్షలు జరుపకుండా ఉండేలా ఉ.కొరియాపై ప్రపంచదేశాలు ఒత్తిడి తేవాలని కోరారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైన(నవంబర్‌ 8) తర్వాత నుంచి అమెరికా అద్భుత ప్రగతి సాధిస్తున్నదని ట్రంప్‌ స్వీయకి తాబు ఇచ్చుకున్నారు. స్టాక్‌ మార్కెట్లు ఆశాజనకంగా పరు గెడుతున్నాయని, నిరుద్యోగ సమస్య అతితక్కువ స్థాయికి చేరిందని.. ప్రతి విషయంలోనూ అమెరికాను ముందుం చడమే తన పని అని గుర్తుచేశారు. దేశసైనిక రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు వెల్లడించారు. ఉ.కొరియాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిలుపునిచ్చారు. క్షిపణి ప్రయోగాలు చేయకుండా ఉత్తరకొరియాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని అన్నారు. ఉత్తర కొరియాతో పాటు ఇరాన్‌ అణు కార్యక్రమం, వెనిజులాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం వంటి అంశాలపై కూడా ట్రంప్‌ ప్రసంగించారు. ఉత్తరకొరియా, ఇరాన్‌లతో ప్రపంచ దేశాధినేతలు చర్చలు జరపాలని అన్నారు. 
ఐరాస తన శక్తిమేరకు పనిచేయటం లేదు : ట్రంప్‌ 
ఐక్యరాజ్యసమితి పనివిధానంలో సంస్కరణలు జరపాలని ట్రంప్‌ గట్టిగా వాదిస్తున్నారు. 10 పాయింట్లతో కూడిన సంస్కరణల తీర్మానాన్ని సోమవారంనాడు ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సమర్థిస్తూ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌, ట్రంప్‌ ప్రసంగించారు. సంస్కరణల తీర్మానానికి 128 దేశాలు మద్దతు తెలిపినట్టు సమాచారం. ఐరాసలో సంస్థాగతంగా మార్పులు చేయాలని, ప్రధాన కార్యదర్శికి మరిన్ని కార్యనిర్వాహక అధికారాలు కట్టబెట్టాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.
సంస్కరణల తీర్మానాన్ని రష్యా, చైనా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా...తదితర దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ తీర్మానంపై కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఆ దేశాలు ఆగ్రహం కూడా వ్యక్తం చేశాయి. తీర్మానంపై సోమవారంనాటి కార్యక్రమానికి ఆ దేశాల రాయబారుల్ని అమెరికా ఆహ్వానించలేదు. తాజాగా ప్రారంభమైన ఐరాస సర్వసభ్య సమావేశాల్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం అమెరికా ఉపయోగించుకుంటున్నదని రష్యా ఉన్నతాది óకారులు విమర్శించారు. ట్రంప్‌ ప్రవేశపెట్టిన సంస్కరణల తీర్మానం వల్ల అంతర్జాతీయంగా ఐరాస పాత్ర పడిపోతుం దని, అలాంటిదానికి తాము మద్దతు పలకమని రష్యా పార్లమెంట్‌లో అంతర్జాతీయ సంబంధాల కమిటీ ఛైర్మన్‌ లియోనిడ్‌ స్లట్స్క్‌ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com