రాంగోపాల్ వర్మ కు కోర్టు షాక్..అరెస్టుకు ఆదేశం..

- September 19, 2017 , by Maagulf
రాంగోపాల్ వర్మ కు కోర్టు షాక్..అరెస్టుకు ఆదేశం..

నిత్యం వివాదాలలో నడిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు , ఇన్నాళ్ళకి అడ్డంగా దొరికారా ? ఇక ఆయన ని అరస్ట్ చెయ్యక తప్పదా ? పోలీసులు ఆ పనిమీదనే ఉన్నారా ? అవును అనే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. తాజాగా ఆయన తీసిన వంగవీటి సినిమా కి సంబంధించి వివాదం రేగిన సంగతి తెలిసిందే.
వంగవీటి రంగా జీవితం మీద సినిమా తీసిన ఆయన ఆ సినిమా ద్వారా రంగా గొప్పతనం కాకుండా నెహ్రూ కి కొమ్ము కాశారు అంటూ సినిమా పూర్తి ఐన తరవాత చాలా మంది ఆరోపించారు.
అప్పట్లో సినిమా షూటింగ్ టైం లోనే వంగవీటి రంగా కొడుకు వంగవీటి రాధా వర్మకి కొన్ని విషయాలు పరిగణ లోకి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేసారు. దాన్ని వర్మ మినిమం కూడా కేర్ చెయ్యలేదు.
ఇష్టం వచ్చినట్టు సినిమాని తీసేసారు . సో తన తండ్రి నీ తన ఇంటి పేరు నీ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు అని వంగవీటి రాధ సీరియస్ అయ్యారు. ఇదే విషయం తో తల్లి తో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయస్థానం రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com