గల్ఫ్ ప్రాంతంలో ప్రజల కష్టాలను తొలగించడం అత్యవసరం : బహ్రైన్ యువరాజు
- October 31, 2015
11 వ మనామా డైలాగ్ కు విచ్చేసిన అతిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గల్ఫ్ ప్రాంతంలో ప్రజల కష్టాలను తొలగించడం మునుపెన్నడూ లేనంత ముఖ్యమైనదని, బహ్రైన్ యువరాజు హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ప్రకటించారు. దీర్ఘకాలిక స్థిరత్వం అనేది ఆశావాదం, అవకాశం మరియు శ్రేయస్సు అనే పునాదులపై నిర్మింపబడుతుందని, ఈ ప్రాంతంలోని ప్రతి సంస్కరణలో సహనం మరియు సహజీవనo ప్రతిబింబించాలని ఆయన నొక్కి చెప్పారు. సరిగ్గా ఈ విధానాలకు వ్యతిరేకమైన వాటినే అభివృద్ధికి వ్యతిరేకులైన తీవ్రవాదులు నమ్మి ఆచరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిరియా లోని పౌర యుద్ధం ఫలితంగా మిలియన్ల అమాయక ప్రజలు కష్టాలపాలయ్యారని అందరూ అంగీకరించక తప్పని నిజమని; ఈ సంవత్సరం రానున్న రెండురోజులు కొనసాగనున్న ఈ సమావేశంలో ఈ ప్రాంతం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక సమస్యాత్మక అంశాలకు పరిష్కారాలను గురించి చర్చించి, తద్వారా శాంతిని నెలకొల్పే పరిష్కారాలను కనుగొనగలదని ఆయన అభిలషించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







