గల్ఫ్ ప్రాంతంలో ప్రజల కష్టాలను తొలగించడం అత్యవసరం : బహ్రైన్ యువరాజు

- October 31, 2015 , by Maagulf
గల్ఫ్ ప్రాంతంలో ప్రజల కష్టాలను తొలగించడం అత్యవసరం : బహ్రైన్ యువరాజు

11 వ మనామా డైలాగ్ కు విచ్చేసిన అతిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గల్ఫ్ ప్రాంతంలో ప్రజల కష్టాలను తొలగించడం మునుపెన్నడూ లేనంత ముఖ్యమైనదని, బహ్రైన్ యువరాజు  హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ప్రకటించారు. దీర్ఘకాలిక స్థిరత్వం అనేది ఆశావాదం, అవకాశం మరియు శ్రేయస్సు అనే పునాదులపై నిర్మింపబడుతుందని, ఈ ప్రాంతంలోని ప్రతి సంస్కరణలో సహనం మరియు సహజీవనo ప్రతిబింబించాలని ఆయన నొక్కి చెప్పారు. సరిగ్గా ఈ విధానాలకు వ్యతిరేకమైన వాటినే అభివృద్ధికి వ్యతిరేకులైన తీవ్రవాదులు నమ్మి ఆచరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిరియా లోని పౌర యుద్ధం ఫలితంగా మిలియన్ల అమాయక ప్రజలు కష్టాలపాలయ్యారని అందరూ అంగీకరించక తప్పని నిజమని; ఈ సంవత్సరం రానున్న రెండురోజులు కొనసాగనున్న ఈ సమావేశంలో ఈ ప్రాంతం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక సమస్యాత్మక అంశాలకు పరిష్కారాలను గురించి చర్చించి, తద్వారా శాంతిని నెలకొల్పే పరిష్కారాలను కనుగొనగలదని ఆయన అభిలషించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com