ఐక్యరాజ్యసమితి సమావేశాల వేదికగా భారత్ వర్సెస్ పాక్

- September 22, 2017 , by Maagulf
ఐక్యరాజ్యసమితి సమావేశాల వేదికగా భారత్ వర్సెస్ పాక్

- కాశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న పాక్‌ 
- పాక్‌ ఉగ్రవాద దేశంగా మారిందన్న భారత్‌ 
ఐక్యరాజ్యసమితి సమావేశాల వేదికగా భారత్‌, పాక్‌లు పరస్పర విమర్శలు చేసుకు న్నాయి. కాశ్మీర్‌లో భారత్‌ మానవహక్కుల ఉల్లం ఘనకు పాల్పడుతుందోని పాక్‌ ఆరోపించింది. ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్‌ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితిలో ఎవ్వరూ లేరని భారత్‌ తిరుగు సమాధానమిచ్చింది. పాకిస్థాన్‌ కాస్తా టెర్రరిస్థాన్‌గా మారిందని భారత్‌ ఆరోపిం చింది. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాక్‌ ప్రధాని అబ్బాసీ మాట్లాడానికి ముందే భారత విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌ పాకిస్థాన్‌ ఉగ్రవాదంపై మాట్లాడారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే యత్నాలను ఖండించాలని బ్రిక్స్‌ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాల్లో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారని సుష్మా అన్నారు. ప్రపం చ శాంతి, భద్రతలను ఉగ్రవాద భూతం వెంటాడు తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా కాశ్మీర్‌ సమస్య పరిష్కారానికి ప్రత్యేక రాయబారిని నియ మించాలని పాకిస్తాన్‌ ఐక్యరాజ్య సమితిని కోరింది. జమ్మూ కాశ్మీర్‌లో భారత్‌ మానవ హక్కుల ఉల్లం ఘనకు పాల్పడుతోందని ఆరోపించింది. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో గురువారం పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి షహీద్‌ ఖాకన్‌ అబ్బాసి మాట్లాడారు. కాశ్మీర్‌, ఉగ్రవాదం అంశాలను ప్రస్తావిస్తూ భారత్‌పై విమర్శలు చేశారు. భారత్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో చేపడుతున్న సైనిక చర్యలు ప్రతిఘటనను ఆహ్వానించేవిగా ఉన్నాయని అబ్బాస్‌ అన్నారు. నియంత్రణ రేఖపై కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతూ తన తప్పిదాల నుంచి ప్రపంచ దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. కాశ్మీర్‌ వివాదాన్ని న్యాయస మ్మతంగా, శాంతియుతంగా త్వరితగతిన పరిష్కరిం చాలన్నారు. పాకిస్తాన్‌తో శాంతి ప్రక్రియకు భారత్‌ సుముఖంగా లేకపోతే జమ్మూ కాశ్మీర్‌పై ఐరాస తీర్మానాలను అమలు చేయాలని భద్రతా మండలిని కోరతామని అన్నారు. 
కాగా, అబ్బాస్‌ వ్యాఖ్యలకు భారత్‌ తీవ్రంగా స్పందిస్తూ పాక్‌ ఒక ఉగ్రవాద దేశంగా మారిపోయిం దని వ్యాఖ్యానించింది. పాక్‌ చేసిన ఆరోపణలను ఐక్యరాజ్య సమితిలో భారత్‌ మిషన్‌కు తొలి కార్య దర్శిగా వ్యవహరిస్తున్న ఈనామ్‌ గంభీర్‌ ఖండిస్తూ,. తాము ఉగ్రవాద బాధితులమని అన్నారు.. పాక్‌ ఉగ్రవాదానికి పర్యాయ పదంగా మారిందని, ప్రపం చానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నదని వ్యాఖ్యా నించారు. ఉగ్ర నేతలకు పాక్‌ రాజకీయపరంగా రక్షణ కల్పిస్తున్నారంటూ విమర్శలు చేశారు. లష్కరే తోయిబా నేత హఫీజ్‌ సయిద్‌ ప్రస్తుతం పాక్‌లోని ఓ చట్టబద్దమైన రాజకీయపార్టీకి నాయకుడిగా అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఉగ్రవాదులకు సౌకర్యాలు కల్పించడం కోసం పాకిస్తాన్‌ బిలియన్‌ డాలర్లు ఖర్చు పెడుతోందని, అక్కడ ఉగ్రవాదులు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతారని, అలాంటి దేశం భారత్‌లోని మానవ హక్కుల గురించి ప్రసంగాలు చేయడం విడ్డూరమని ఈనమ్‌ గంభీర్‌ అన్నారు. అంతేకాక కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో భూబాగమే అని, ఇది పాక్‌ అర్ధం చేసుకొని మసులు కోవాలని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com