నిద్ర కరువైతే... సెల్ ఫోన్లు వాడితే.. కెలోరీలు ఖర్చు కావా?

- September 22, 2017 , by Maagulf
నిద్ర కరువైతే... సెల్ ఫోన్లు వాడితే.. కెలోరీలు ఖర్చు కావా?

నిద్ర కరువైతే బరువు పెరిగిపోతారని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రిపూట పది గంటలకల్లా నిద్రకు ఉపక్రమించి.. ఉదయం పూట ఆరు గంటలకు నిద్రలేవాలి. దాదాపు 8 గంటల పాటు నిద్రపోనట్లైతే.. శరీర బరువు అమాంతం పెరిగిపోవడం ఖాయమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నిద్రలోపాల ద్వారా బరువు పెరగడమే కాకుండా అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. నిద్రలేమి ద్వారా శరీరం అలసటకు గురవుతుంది. అందుకే నిద్రించేందుకు అర గంట ముందు టీవీ లేదా మొబైళ్లను కట్టి పడేయాలి. సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్లు ఉపయోగించే వారు వాటిని దూరంగా ఉంచాలని పరిశోధనలో తేలింది. 
 
చీకటిలో నిద్రించే వారితో పోలిస్తే, టీవీ, స్మార్ట్ ఫోన్, లాప్‌టాప్ వంటి కృత్రిమ వెలుగును అధిక సమయం వెచ్చించే వారిలో ఊబకాయం తప్పదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కృత్రిమ వెలుతురు కేలరీలను ఖర్చు చేసే బ్రౌన్ సెల్స్‌ను కూడా ప్రభావితపరుస్తాయట. తద్వారా కెలోరీలు ఖర్చు కాకుండా బరువు పెరిగిపోతారని, ఊబకాయంతో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటి ఇతరేతర వ్యాధులు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com