మహానుభావుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో శర్వానంద్‌ను పొగడతలతో ముంచెత్తిన ప్రభాస్
- September 24, 2017
- ప్రభాస్
''శర్వానంద్ మా ఇంటి హీరో. తన ప్రవర్తన బాగుంటుంది. శర్వా కాబోయే సూపర్ స్టార్'' అన్నారు ప్రముఖ కథానాయకుడు ప్రభాస్. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మహానుభావుడు'. మెహరీన్ కథానాయిక. మారుతి దర్శకుడు. యు.వీ ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కించింది. వంశీ, ప్రమోద్ నిర్మాతలు. ఈనెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభాస్ మాట్లాడుతూ ''యువీ క్రియేషన్స్ నిర్మించిన 'రన్‌రాజా రన్'లో నటించాడు శర్వా. పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ చిత్రంలో నటించడం అదే తొలిసారి. ఈపాత్రకు శర్వా సరిపోతాడా? అనే అనుమానం వచ్చింది. అయితే నిర్మాతలు మాత్రం 'ట్రై చేసి చూడండి.. మిగిలిన సంగతి తరవాత చూద్దాం' అన్నారు. ఆ సినిమాలో శర్వా నటన చూసి అభిమాని అయిపోయా. ఆ రోజు నుంచి సొంత తమ్ముడిలా మారిపోయాడు. నవ్వించడం అంత తేలికైన విషయం కాదు. మారుతి తెరకెక్కించిన 'ప్రేమకథా చిత్రమ్' చూసి పడీ పడీ నవ్వుకొన్నా. 'భలే భలే మగాడివోయ్' కూడా బాగా నచ్చింది. ఆ రెండు సినిమాల్ని మించిన విజయం అందుకోవాలి. తమన్ పాటలు బాగున్నాయి. కారులో వెళ్లేటప్పుడు ఈ సినిమా పాటలే వింటున్నా'' అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ ''ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. చాలా రోజుల తరవాత ఆస్వాదిస్తూ చేసిన సినిమా ఇది. సెట్లోంచి ఇంటికొచ్చాక 'ఈరోజు మంచి సీన్ చేశాన్రా' అనే సంతృప్తితో నిద్రపోయేవాడిణ్ని ఈ సినిమాలో నేను మహానుభావుణ్ని. కానీ నిజ జీవితంలో మహానుభావుడు మాత్రం ప్రభాస్. సాధారణంగా మనకు నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే గొప్ప. ప్రభాస్‌కి మాత్రం అలాంటి స్నేహితులు పాతిక మంది ఉన్నారు. ఎదుటివారిని ప్రేమించడం తప్ప తనకేం తెలీదు. నా సినిమా వస్తోందంటే నాకంటే ఎక్కువ ఒత్తిడికి గురవుతాడు. 'రన్ రాజా రన్' చూసి.. 'ఈ సినిమాతో హిట్టు కొట్టాం.. ఎంజాయ్ చేయ్' అని ప్రోత్సహించాడు. తన చుట్టూ ఉన్నవాళ్లు పైకి రావాలని కోరుకొనే వ్యక్తి ప్రభాస్ అన్న'' అని చెప్పారు. ''మారుతి మంచి దర్శకుడు. తాను ఇచ్చిన ప్రోత్సాహం, ఉత్సాహం అంతా ఇంతా కాదు. నా దగ్గరనుంచి మంచి పాటల్ని తీసుకొన్నాడు. ఈ సినిమాకి చాలామంది మహానుభావులు పనిచేశారు. తప్పకుండా మంచి విజయం అందుకొంటుంద''న్నారు తమన్. మారుతి మాట్లాడుతూ ''స్నేహితులతో చేసిన సినిమా ఇది. ఈ కథకు శర్వా ప్రాణం పోశాడు. శర్వా విశ్వరూపం థియేటర్లలో చూడబోతున్నారు. అంత బాగా నటించాడు. మెహరీన్ కూడా బాగా నటించింది. ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. తను అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. నాకంటే ఈ సినిమాని మా టీమ్ ప్రేమించింది. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. కుటుంబంతో కలసి చూసి ఆస్వాదించండ''న్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







