కేరళ లో షూటింగ్ జరుపుకుంటున్న 'రాజా ది గ్రేట్‌'

- September 24, 2017 , by Maagulf
కేరళ లో షూటింగ్ జరుపుకుంటున్న 'రాజా ది గ్రేట్‌'

రాజా ప్రపంచాన్ని చూడలేడు. అయితేనేం, ప్రపంచం మొత్తం తనవైపు తిరిగి చూసేలా చేశాడు. మరి రాజా చేసిన ఆ గొప్ప పనేంటో తెలియాలంటే 'రాజా ది గ్రేట్‌' సినిమా చూడాల్సిందే. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. మెహరీన్‌ కథానాయిక. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శిరీష్‌ నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. చిత్రీ కరణ తుదిదశకు చేరుకొంది. ప్రస్తుతం కేరళలో నాయకా నాయికలపై ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో రవితేజ అంధుడిగా నటించారు. ఆయన పాత్ర, నటన కొత్త తరహాలో ఉండబోతోందని, ఇంటిల్లిపాదినీ అలరించే వినోదంతో చిత్రం తెరకెక్కుతోందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com