బాదామి హరియాలి
- September 26, 2017కావలసిన పదార్థాలు: ఉల్లికాడలు - 5, పచ్చిమిర్చి - 4, బాదం తరగు - అరకప్పు, అల్లం తరుగు - 2 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు - ముప్పావు కప్పు, మెంతి ఆకులు - అరకప్పు, ఉడికించిన బీన్స్ - 1 కప్పు, పచ్చిబఠాణి - 1 కప్పు, తాజా క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు, పంచదార - 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి - 1 టీ స్పూను, బిర్యాని ఆకు - 1, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, పనీర్ తురుము - అలంకరణకు.
తయారుచేసే విధానం: బాదం తరుగుతో పాటు ఉల్లి కాడలు (తెల్లని భాగం మాత్రమే), కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం తరుగు మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. నూనెలో బిర్యాని ఆకుతో పాటు బాదం పేస్టు వేసి పచ్చివాసన పోయేవరకు చిన్నమంటపై వేగించాలి. ఇప్పుడు మెంతి ఆకులు, పచ్చిబఠాణి, ఉప్పు, పంచదార, జీలకర్ర పొడి కలిపి 8 నిమిషాల ఉంచాలి. తర్వాత ఉడికించిన బీన్స్, క్రీమ్ వేసి 3 నిమిషాలు తర్వాత పనీర్ తురుము చల్లి దించెయ్యాలి. నాన్, పరాటాలతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ