ఒక వ్యక్తిని హత్య చేసి సముద్రంలో విసిరేసిన ముగ్గురు ఆసియా దేశస్థులు అరెస్ట్

- September 26, 2017 , by Maagulf
ఒక వ్యక్తిని హత్య చేసి సముద్రంలో విసిరేసిన  ముగ్గురు ఆసియా దేశస్థులు అరెస్ట్

మస్కట్ : ఒక వ్యక్తిని చంపి సముద్రంలో విసిరివేసిన ఓ ముగ్గురు ఆసియా దేశస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ బటినా పోలీసుల ముఖ్య కేంద్రంలో విచారణ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ శాఖ ఆ హత్య కేసులో ముగ్గురు ఆసియన్లను అరెస్టు చేసినట్లు ఒక రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి తెలిపారు. ఆయన " మా గల్ఫ్ డాట్ కామ్ " తో  మాట్లాడుతూ, ఈ ముగ్గురు నిందితులు ముస్సానా విలాయత్ లోని   హతుని ఇంటికి వెళ్లి బైటకు తీసుకువచ్చి చంపి ఆ వ్యక్తి శరీరాన్నిసముద్రంలోకి విసిరివేసారు. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారిపై అభియోగాలు మోపి నిందితుల అందరిని  తదుపరి దర్యాప్తు కోసం న్యాయ అధికారులకు సూచించబడినట్లు ఆ అధికారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com