హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో అంబరాన్నంటిన మహా బతుకమ్మ సంబురం..

- September 26, 2017 , by Maagulf
హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో అంబరాన్నంటిన మహా బతుకమ్మ సంబురం..

టు చూసినా పూల పరిమళాలే.. ఏ నోట విన్నా బతుకమ్మ పాటలే.. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ పండుగ వాతావరణం కనిపించింది. భాగ్యనగరంలో మహా బతుకమ్మ వేడుక రంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ బొడ్డెమ్మ ఆడారు.
ఎల్బీ స్టేడియం పూల వనాన్ని తలపించింది.. మహా బతుకమ్మ వేడుక భాగ్యనగరంలో వైభవంగా జరిగింది..ఉయ్యాల పాటలతో ఎల్బీ స్టేడియం మారుమోగింది..35 వేల మంది మహిళలతో మహా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి..31 జిల్లాల నుంచి తరలివచ్చిన మహిళలు ఆటపాటలతో సందడి చేశారు..
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా బతుకమ్మ వేడుకలకు రాష్ట్రం నలుమూలల మహిళలు తరలివచ్చారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత వేడుకలను ప్రారంభించి మహిళలతోకలిసి బతుకమ్మ ఆడారు. స్టేడియం మొత్తం కలియతిరుగుతూ వివిధ గ్రూపుల వద్ద బతుకమ్మ ఆడారు.
19 రాష్ర్టాలకు చెందిన కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 15 రాష్ర్టాల నుంచి బ్రహ్మకుమారీలు రంగు రంగుల దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారు కూడా బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com