హైదరాబాద్‌లో కెమో ఫార్ములేషన్స్‌ యూనిట్‌

- September 27, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో కెమో ఫార్ములేషన్స్‌ యూనిట్‌

-ఐదేండ్లలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సంస్థ హైదరాబాద్, సెప్టెంబర్ 27: స్పెయిన్‌కు చెందిన ప్రముఖ హెల్త్‌కేర్ సేవల సంస్థ కెమో గ్రూపు..ఫార్మా హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్‌లో ఉత్పత్తి కేంద్రాన్ని బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కే ఆర్ కుమార్ మాట్లాడుతూ..భారత్‌లో వ్యాపారాన్ని విస్తరించడానికి వచ్చే నాలుగు నుంచి ఐదేండ్లకాలంలో రూ.400-500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. దీంట్లోభాగంగానే రూ.100 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌కు సమీపంలోని జినోమి వ్యాలీలోగల ఐదు ఎకరాల స్థలంలో పరిశోధన కేంద్రాన్ని, తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వచ్చే రెండు నుంచి మూడేండ్లకాలంలో ఈ యూనిట్‌ను మరింత విస్తరించడానికి రూ.75-100 కోట్లు, మూడో విడుతలో భాగంగా మరో రూ.100 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ యూనిట్‌లో 35 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, 2020 నాటికి ఈ సంఖ్య 100కి చేరుకోనున్నదన్నారు. మూడోదఫా విస్తరణ పనులు పూర్తయితే సిబ్బంది సంఖ్య 300 నుంచి 350కి చేరుకోనున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రంలో ఉత్పత్తైన ఔషధాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నది. దేశీయ ఫార్మా రంగంలో స్పెయిన్‌కు చెందిన సంస్థ పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి.

ఈ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి అక్టోబర్ 2015లోనే రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com