ఆంధ్రప్రదేశ్‌లో హెల్మెట్లు తప్పనిసరి..లేకుంటే పెట్రోల్ బంద్

- September 27, 2017 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌లో హెల్మెట్లు తప్పనిసరి..లేకుంటే పెట్రోల్ బంద్

ఆంధ్రప్రదేశ్‌లో రేపట్నుంచి హెల్మెట్లు తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. హెల్మెట్లు ధరించకపోయినా, కార్లలో సీటు బెల్టులు పెట్టుకోకపోయినా పెట్రోల్ పోయవద్దంటూ బంక్‌లకు ఆర్డర్‌ పాస్ చేశారు. రహదారి భద్రతపై సమీక్ష జరిపిన ఏపీ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రేపట్నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేయాలని రవాణా, పోలీస్‌ శాఖలకు సూచించారు సీఎం. హెల్మెట్లు, సీటు బెల్టులు ధరించని వారికి.. ఎక్కడైనా పెట్రోల్ పోసినట్లు తెలిస్తే.. ఆ బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీసు, రవాణా శాఖల్లో జవాబుదారీతనం మరింత పెరగాలన్నారు సీఎం చంద్రబాబు. నియమాలు కఠినంగా ఉన్నా, అమలు బాగుంటేనే ప్రమాదాలను నివారించగలమన్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న ఓవర్‌లోడ్ ఆటోలను నియంత్రించాలని సూచించారు. అన్ని స్కూల్‌ బస్సులు, ప్యాసింజర్ వాహనాలకు స్పీడ్ గవర్నర్స్‌ తప్పనిసరి చేయాలన్నారు.   రహదారి భద్రత కోసం వినియోగించే పరికారల కోసం 10 కోట్ల రూపాయలను విడుదల చేశారు ముఖ్యమంత్రి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com