10ఏళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌

- September 28, 2017 , by Maagulf
10ఏళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌

దశాబ్ధం క్రితం వెండితెర పై చిరుతలాగా పంజా విసిరి సక్సెస్ కొల్లగొట్టిన మగధీరుడు రామ్‌చరణ్. సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్‌గా తన స్టామినాను ఫ్రూవ్ చేసుకుంటూ పోతున్న రామ్ చరణ్....నేటితో విజయవంతంగా 10 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. జయాపజయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ... నాయకుడిగా వెలుగొందుతున్నాడు. కష్టం వచ్చినప్పుడు గోవిందుడు అందరివాడిలా..ఆపద వచ్చినప్పుడు బ్రూస్ లీ ఫైటర్ గా పోరాడుతూ ధృవతారలాగా మెరిసిపోతున్నాడు. ఈ ఏడాది ప్రొడ్యూసర్‌గా కూడా మారి తన తండ్రిని మరోసారి హీరోని చేస్తూ ఖైదీ నెం 150ని తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. అదే ఊపుతో సై రా నరసింహరెడ్డికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి విజయాలు ఆయన కెరీర్‌లో మరిన్ని ఉండాలని కోరుతూ ...ఆల్ ది బెస్ట్ రామ్ చరణ్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com