పురుషులతో సమానంగా స్త్రీలకు డ్రైవింగ్ లైసెన్సులు మంజూరు

- September 28, 2017 , by Maagulf
పురుషులతో సమానంగా స్త్రీలకు డ్రైవింగ్ లైసెన్సులు మంజూరు

సౌదీ అరేబియా : పురుషులతో సమానంగా స్త్రీలు వాహనాలు నడపరాధనే వివక్షకు కింగ్ సల్మాన్ జారీ చేసిన రాజాజ్ఞతో తెరపడింది. మహిళల హక్కుల అణచివేతపై పలువురు విమర్శలను తిప్పికొట్టడానికి  సౌదీ పురుషులు మరియు మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేయడానికి పురుష మరియు మహిళా మేధావులు రాజరిక డిక్రీని స్వాగతించారు.ఈ చర్య సమానత్వంతో కూడిన భవిష్యత్తు సౌదీ అరేబియా పునిర్మాణానికి తొలి అడుగుగా పలువురు పేర్కొంటున్నారు. రాయల్ డిక్రీ విజువల్ 2030 ప్రకారం, ఒక బలమైన ఆర్ధిక వ్యవస్థ మరియు ప్రతిష్టాత్మక దేశం నిర్మించడానికి ఒక బలమైన పునాదిగా సమాజంను తీర్చిదిద్దుతూ అభివృద్ధి పై ప్రధానంగా దృష్టి పెడుతుంది.  కింగ్ సాడ్ యూనివర్సిటీలో డీన్ ప్రిన్స్ నైఫ్ బిన్ థానియన్ బిన్ మహమ్మద్ డీన్ ఈ సందర్బంగా మాట్లాడుతూ,"అన్ని రంగాలలోనూ సౌదీ స్త్రీల హక్కులను సమర్ధించాలని కింగ్ సల్మాన్ ఎల్లప్పుడూ కోరినందున,మహిళలకు నాయకత్వ స్థానాలను భర్తీ చేయగలిగింది, మున్సిపల్ ఎన్నికలలో ఓటు చేసే హక్కు కల్పించడమే కాక మరియు అభ్యర్థి గా పోటీ చేసే అవకాశాన్ని సైతం ఆయన గతంలో కల్పించారు తద్వారా  సమాజంలో సమర్థవంతమైన సభ్యురాలిగా మహిళ తనను తాను నిరూపించుకోండన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com