ఉద్యోగాలు వద్దా? అయితే ప్యాకెజీలు ఇస్తామంటున్న కేసిఆర్
- September 29, 2017
సింగరేణి కార్మికుల సమస్యలు అర్థం చేసుకోవడంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తే దానిపై కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. వారసత్వ ఉద్యోగాలపై కోర్టు స్టే ఇస్తే జాతీయ సంఘాలు స్వీట్లు పంచుకున్నాయని గుర్తు చేశారు. వారసత్వ ఉద్యోగాల స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టాలని టీబీజీకేఎస్ ప్రతిపాదనకు ప్రభుత్వం మద్దతిస్తుందని చెప్పిన కేసీఆర్ .. ఉద్యోగాలు అవసరం లేదనుకున్న వారికి రూ. 25 లక్షల ప్యాకేజీ ఇస్తామని తెలిపారు. చిల్లర రాజకీయాలు చేసే అవసరం తనకు లేదని, కార్మికుల ఇబ్బందులు తగ్గించేందుకు ఆటో మిషన్ చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతి నెల సింగరేణిపై 2 గంటల రివ్యూ చేస్తామని, 2 నెలల్లో బోగస్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. సింగరేణిలో 1980 తర్వాత కొత్త ఉద్యోగాలు లేవని తమ ప్రభుత్వం వచ్చాకే మళ్లీ నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









