కెనడాలో ఉగ్ర కలకలం

- October 01, 2017 , by Maagulf
కెనడాలో ఉగ్ర కలకలం

కెనడాలో రెండు ఘటనలు ఉగ్ర కలకలం రేపాయి. ఎడ్మాంటన్ లోని కామన్ వెల్త్ ఫుట్ బాల్ స్టేడియం దగ్గర ఓ పోలీస్ మీదకు వాహనాన్ని పోనిచ్చాడు ఓ ఆగంతకుడు. ఈ ఘటనలో పోలీసు.. సుమారు 15 అడుగుల ఎత్తు ఎగిరిపడ్డాడు. అంతటితో ఆగకుండా పోలీస్ మీద కత్తితో దాడికి దిగాడు దుండగుడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. మరో ఘటనలో పాదచారుల పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు ఓ ఆగంతకుడు. పోలీసు మీద దాడి చేసిన వ్యక్తికి సంబంధించి తనిఖీలు చేస్తుండగా.. ఓ ట్రక్కు అక్కడికి వచ్చింది. అందులో ఉన్న వ్యక్తిని డ్రైవింగ్ లైసెన్స్ చూపించాల్సిందిగా అడిగాడు డ్యూటీలో ఉన్న పోలీసు. దీంతో వెంటనే.. అతనిపైకి ట్రక్కు ఎక్కించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. వెంటనే పోలీసు తప్పించుకోవడంతో మరో నలుగురు పాదచారులపైకి దూసుకెళ్లింది ట్రక్. ఈ దూకుడులో కొంత దూరం వెళ్లిన ట్రక్.. అనంతరం బోల్తా పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com