మాజీ భార్యపై దాడి కేసులో నిందితుడికి జైలు శిక్ష
- October 04, 2017
మనామా: థర్డ్ లోవర్ క్రిమినల్ కోర్టు, బహ్రెయినీ వ్యక్తి ఒకరికి ఏడాది జైలు శిక్ష విధించింది. జెబ్లాత్ హబ్జిలోని ఓ ఇంట్లో, తన మాజీ భార్యపై నిందితుడు అత్యంత పాశవికంగా దాడి చేసిన ఘటనలో న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది. 52 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తి ఈ కేసులో దోషిగా తేలగా, అతని చేతిలో చావు దెబ్బలు తిన్న వ్యక్తి సిరియాకి చెందిన మహిళ. 32 ఏళ్ళ బాధితురాల్ని జహ్రా సుభిగా గుర్తించారు. హృదయ విదారకమైన పరిస్థితుల్లో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. తనను, తన పిల్లల్ని రక్షించాల్సిందిగా పోలీసుల్ని వేడుకుందామె. సెప్టెంబర్ 16న ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు తన ఆవేదనను వీడియోలో చిత్రీకరించగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో తమ దృష్టికి రాగానే, పోలీసులు రంగంలోకి దిగి, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాల్ని అంబులెన్స్ ద్వారా సలామానియా మెడికల్ కాంప్లెక్స్‌కి తరలించి, వైద్య చికిత్స అందించారు. బాధితురాలికి లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఓ అపార్ట్‌మెంట్‌ని కేటాయించింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







