పుట్టిన రోజు గిఫ్ట్ చూసి కంటతడి పెట్టిన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్
- October 10, 2017
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న తన 75 వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. కానీ తాను ఈ సంవత్సరం.. పుట్టిన రోజు, దీపావళి వేడుకలను జరుపుకోవాలని అనుకోవడం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. ఈ నేపద్యంలో అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న "కౌన్ బనేగా కరోడ్ పతి" షో నిర్వాహకులు బిగ్ బీకి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారు. అమితాబ్ చదివిన ఉత్తరాఖండ్ నైనిటాల్ లోని షేర్ వుడ్ కళాశాలకు చెందిన టీచర్స్, స్టూడెంట్స్ తో బర్త్ డే విశేష్ చెప్పి... ఆ వీడియోని "కౌన్ బనేగా కరోడ్ పతి" షో జరుగుతున్న సమయంలో ప్లే చేశారు.. తాను చదివిన కళాశాలను చూసి.. ఆనందంతో బిగ్ బీ కంట తడిపెట్టారు. అంతేకాదు.. కళాశాల మొత్తం అమితాబ్ పోస్టర్స్ ని అంటించడమే కాదు... ఆయనకిష్టమైన గిటారిస్ట్ నీలాద్రి కుమార్ తో పుట్టిన రోజు ట్యూన్ ని కూడా ఆ వీడియోలో పొందుపరిచారు.. ఈ స్పెషల్ ఎపిసోడ్ ని బిగ్ పుట్టిన రోజైన రేపు షో నిర్వాహక ఛానల్ వారు ప్రసారం చేయనున్నారు.. అమితాబ్ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్, 102 నాటౌట్ హిందీ సినిమాలతో పాటు.. చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







