కువైట్ ఆయిల్ కంపెనీ బుర్గాన్ క్షేత్రంలో అగ్ని ప్రమాదం నల్గురు కార్మికులకు గాయాలు
- October 13, 2017
కువైట్ : కువైట్ ఆయిల్ కంపెనీకి చెందిన బుర్గాన్ చమురు క్షేత్రంలోని నిర్మాణ స్థలంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారని కె.ఒ.సి అధికారి గురువారం తెలిపారు.కువైట్ ఆయిల్ కంపెనీకి చెందిన అధికార ప్రతినిధి మరియు ప్రస్తుత డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మెహహీ అల్-ఎనిజీ వివరిస్తూ, బుర్గాన్ లో బుధవారం సాయంత్రం 6: 50 సమయంలో కార్మికులు ఒక పనిచేసే స్థలంలో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. కాలిన గాయాలతో ఉన్నవారిని అహ్మది ఆసుపత్రికి వెంటనే తరలించినట్లు ప్రస్తుతం వారికి అక్కడ మెరుగైన చికిత్స పొందుతున్నారని ఆయన కువైట్ ఆయిల్ కంపెనీ ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. కువైట్ ఆయిల్ కంపెనీకి చెందిన సంబంధిత అగ్ని నియంత్రణ బృందాలు తక్షణమే ఆ ప్రదేశానికి తరలించామని, ఆ తరువాత కంపెనీని అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా వ్యాపించకుండా ఆ అగ్నిని సమర్ధవంతంగా నియంత్రించామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







