నిజ జీవిత సంఘ‌ట‌న‌లు ఆధారంగా 'శివ‌కాశీపురం'

- October 14, 2017 , by Maagulf
నిజ జీవిత సంఘ‌ట‌న‌లు ఆధారంగా 'శివ‌కాశీపురం'

సంగీత ద‌ర్శ‌కులు చ‌క్ర‌వ‌ర్తి మ‌న‌వ‌డు రాజేశ్ శ్రీ చ‌క్ర‌వ‌ర్తి క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ సాయి హ‌రేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ పై హ‌రీష్ వ‌ట్టి కూటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. గ్రామీణ నేప‌థ్యంలో సాగే అంద‌మైన ప్రేమ క‌థాతో ఈ సినిమా సాగుతుంది. మోహ‌న్ బాబు పులిమామిడి నిర్మిస్తోన్న ఈ చిత్రం పేరు `శివ‌కాశీపురం`. ఇందులో ప్రియాంక శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోంది. ప‌వ‌న్ శేష సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి పాట‌ను  హైద‌రాబాద్ లోని ఎఫ్‌.ఎమ్ స్టేష‌న్ లో రిలీజ్ చేశారు. అలాగే మిగిల‌న సింగిల్స్ ఒక్కొక్క‌టిగా మార్కెట్ లోకి రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com