తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్న ఐటీ కంపెనీలు

- October 15, 2017 , by Maagulf
తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్న ఐటీ కంపెనీలు

హైదరాబాద్: తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్ ఏర్పాటుకు ఇటీవలే మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత సూచనల మేరకు నిజామాబాద్ ఎమ్మెల్లే గణేష్ గుప్తా మరియు టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అమెరికా నుంచి 60 కంపెనీలను పెట్టుబడులకు ఒప్పించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఐటీ మినిస్టర్ కేటీఆర్ రూ. 50 కోట్లు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ, ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు చేయడానికి, పెట్టుబడులను ఆహ్వానించడానికి ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థల యజమానులను మహేష్ బిగాల, టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల కలిశారు. ఆస్ట్రేలియా రెవిన్యూ మినిస్టర్ కెల్లీతో సమావేశమైన వారు.. తెలంగాణ ప్రభుత్వం వివిధ దేశాల కంపెనీల స్థాపనకు ఇస్తున్న ప్రోత్సాహాలను వివరించారు. ఆస్ట్రేలియాలోని ప్రముఖ కంపెనీలైన నెక్సియా, ఇంటరాక్టివ్ సీఈవోలను కలిసి తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, ఐటీ అభివృద్ధికి కావాల్సిన అన్ని వసతులను వివరించారు. నవంబర్ నెలఖారులో ప్రధాని మోదీ, ఇవంక ట్రంప్ ఆధ్వర్యంలో తెలంగాణలో జరగబోయే బిజినెస్ సమ్మిట్ కు ఆస్ర్టేలియా బృందాన్ని ఆహ్వానించారు.

ఈ క్రమంలో ఐటీ పెట్టుబడులపై కేటీఆర్ తో చర్చించేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. మెల్ బోర్న్ నగరం నుంచి ఆరు కంపెనీలు నిజామాబాద్ మరియు కరీంనగర్ లో పెట్టుబడులకు ఆసక్తి వ్యక్తీకరణ లేఖలు ఇవ్వడం జరిగింది. ద్వితీయ శ్రేణి నగరాలలోని యువత ఉపాధి కల్పనకు కేటీఆర్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని వివిధ దేశ కంపెనీలతో పెట్టుబడులకై అహర్నిశలు శ్రమిస్తున్నటీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ గుప్తా, అలాగే మెల్ బోర్న్ లో వివిధ కంపెనీ లతో చర్చలకు సహకరించిన కళ్యాణ్, అనిల్ కు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మరియు కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com