బహ్రెయిన్ లో మాజీ భార్యపై దాడి చేసిన వ్యక్తి అరెస్టు

- October 15, 2017 , by Maagulf
బహ్రెయిన్ లో  మాజీ భార్యపై దాడి చేసిన వ్యక్తి  అరెస్టు

మనామ: ముహర్రాక్ గవర్నైట్ పరిధిలో మాజీ భార్య వాహనాన్ని తన కారుతో ఢీ కొట్టడమే కాక ఆమెపై చేయి చేసుకొన్న ఓ దూకుడు భర్తని  పోలీసులు అరెస్టు చేశారు.బాధితురాలు ఈ దాడిపై స్థానిక  ముహర్రక్ పోలీస్ స్టేషన్ లో తన మాజీ భర్తపై  ఫిర్యాదు చేసింది. తనను తీవ్రంగా కొట్టడంతో తానూ గాయపడినట్లు ఆ మహిళ ఆ ఫిర్యాదులో ఆరోపించింది. నిందితుడు తన కారుతో తన కారుని గుద్దించి  తనపై దాడి చేశాడని ఆమె పోలీసులకు తెలిపింది . ముహర్రక్  గవర్నైట్ ప్రాసిక్యూషన్ ముఖ్యులు  అబ్దుల్లా అల్ డోస్సారి  ప్రాసిక్యూషన్ కేసు గురించి పోలీసు స్టేషన్ నుంచి తనకు వివరాలు అందినట్లు ఆయన ఒక ప్రకటనలో ధ్రువీకరించారు. ఈ కేసులో తన దర్యాప్తును తక్షణమే ప్రారంభించినట్లు చెప్పారు. "బాధితురాలి యొక్క సాక్ష్యాన్ని వినడమే కాక ఆమెను బాధపెట్టిన మాజీ భర్త దుర్మార్గాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది . ఆమెకు ఏర్పడిన  గాయాలు మరియు అందుకు కారణాలను గుర్తించేందుకు ఒక వైద్య పరీక్షను ఆమెకు జరిగించాలని  ఆదేశించింది. విచారణ కొనసాగుతున్న సమయంలో నిందితుడు  ప్రశ్నించబడ్డాడు మరియు పోలీసులచే  నిర్బంధింపబడ్డాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com