సహచరుడిని నగ్నంగా చిత్రీకరించిన పాకిస్తాన్ నిందితునికి జైలుశిక్ష దేశ బహిష్కరణ

- October 16, 2017 , by Maagulf
సహచరుడిని నగ్నంగా చిత్రీకరించిన పాకిస్తాన్ నిందితునికి జైలుశిక్ష దేశ బహిష్కరణ

దుబాయ్:పరాయి దేశంకు వెళితే...కొందరికి  కామ వికారపు చేష్టలు కట్టలు తెంచుకొంటాయి. ఓ 21 ఏళ్ల పాకిస్తాన్ యువకుడు తన సహచర వ్యక్తి  బాత్రూంలో స్నానం చేస్తుంటే రహస్యంగా వీడియోని మొబైల్ లో   చిత్రీకరించారు. తనతో అసహజ లైంగిక కార్యకలాపాలకు సహకరించాలని లేదంటే వీడియో క్లిప్ ని ఆన్లైన్ లో అందరకి చూపుతానని బెదిరించడంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు పిర్యాదు చేశాడు. దాంతో న్యాయస్థానం నిందితుడికి ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ రికార్డుల ప్రకారం జెబెల్ అలీలో వారి శ్రామిక వసతి వద్ద ఓ పాకిస్తానీ కార్మికుడు తన తోటి కార్మికుడు స్నానం చేస్తూఉండగా ఒక వీడియోను చిత్రీకరించాడు. ఆ వీడియోని బాధితుడికి చూపి తనతో  లైంగిక సంబంధం కలిగి ఉండకపోతే నీ నగ్న రూపాన్ని ఆన్లైన్ లో అందరికి షేర్ చేస్తానని బెదిరించాడని నిందితుడిపై బాధితుడు పిర్యాదు చేశాడు.  మొదటి ఇన్స్టిఫ్ కోర్ట్ మరొక మనిషి వ్యక్తిగత గోప్యతను నిందితుడు బట్టబయలు చేయడం ఒక దాడిగా అభివర్ణించారు. ఈ నేరాన్ని కోర్టు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఆ పాకిస్తాన్ నిందితుడిని ఈ కేసులో ప్రధాన అపరాధిగా గుర్తించారు. అలాగే బాధితుడిని బెదిరించేందుకు మరియు సోషల్ మీడియా మరియు సాంకేతికత ఉపయోగించిన నేరానికి  కోర్టు తన జైలు శిక్ష అనుభవించిన తర్వాత దేశం నుండి నిందితుడిని బహిష్కరించాలని సూచించారు నిందితుడు వెలువరించిన తీర్పుపై 15 రోజుల లోపల అప్పీల్ చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com