మహిళా ఉగ్రవాది కరెన్ ఐజా హమిడాన్ను విచారించేందుకు ఫిలిప్పీన్స్‌ను కోరిన ఎన్ఐఏ
- October 21, 2017భారత సంతతి మహిళా ఉగ్రవాది కరెన్ ఐజా హమిడాన్ను విచారించేందుకు అనుమతించాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫిలిప్పీన్స్ ప్రభుత్వాన్ని కోరింది. యువకులకు వలవేసి ఐఎస్ఐఎస్లోకి చేర్పిస్తున్న ఆమెను రెండు రోజుల క్రితం ఫిలిప్పీన్స్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎన్‌బీఐ) అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ వేదికగా ప్రత్యేకించి భారతీయ యువకులను ప్రేరేపిస్తున్న హమిడాన్... ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో పట్టుబడింది.
ఇప్పటికే ఆమెపై రెండు చార్జిషీట్లు దాఖలు చేసిన ఎన్ఐఏ... హమిడాన్ వివరాలు, ఆధారాలు కావాలంటూ గతేడాది ఫిలిప్పీన్స్‌ను కోరిన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో ప్రత్యేకించి సోషల్ మీడియాను అడ్డగా చేసుకుని అనేక మంది భారతీయులకు ఆమె వల వేసినట్టు భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. భారత్ సహా పలు దేశాల నుంచి ఐసిస్‌లోకి 'ఫారెన్ ఫైటర్స్'ను రిక్రూట్ చేసుకునేందుకు ఆమె చురుగ్గా వ్యవహారం నడిపినట్టు సమాచారం. కాగా తాము హమిడాన్ ప్రభావం వల్లే ఐసిస్‌లో చేరినట్టు ఇద్దరు భారత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అల్ ముర్తాఫా గారిసన్ మసీదులో సుల్తాన్ ఈద్ ప్రార్థనలు
- సౌత్ 7వ రింగ్ రోడ్డులో అగ్నిప్రమాదం
- షార్జా విమానాశ్రయంలో ప్రయాణికులకు బహుమతులతో స్వాగతం
- పేషెంట్ భద్రతలో SSIలు కీలకం..!
- అరాఫత్.. 42.2 మిలియన్ కాల్స్, 5.61 వేల TBడేటా వినియోగం
- గోధుమ రవ్వ ధరల పెరుగుదల.. ఆహార భద్రతకు ముప్పు..!
- తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ..
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో డిపార్చర్ గెట్ వద్ద కొత్త డ్యూటి ఫ్రీ స్టోర్
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు..!
- జూన్ 18న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల