మహిళా ఉగ్రవాది కరెన్ ఐజా హమిడాన్‌ను విచారించేందుకు ఫిలిప్పీన్స్‌ను కోరిన ఎన్ఐఏ
- October 21, 2017
భారత సంతతి మహిళా ఉగ్రవాది కరెన్ ఐజా హమిడాన్‌ను విచారించేందుకు అనుమతించాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫిలిప్పీన్స్ ప్రభుత్వాన్ని కోరింది. యువకులకు వలవేసి ఐఎస్ఐఎస్‌లోకి చేర్పిస్తున్న ఆమెను రెండు రోజుల క్రితం ఫిలిప్పీన్స్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎన్‌బీఐ) అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ వేదికగా ప్రత్యేకించి భారతీయ యువకులను ప్రేరేపిస్తున్న హమిడాన్... ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో పట్టుబడింది.
ఇప్పటికే ఆమెపై రెండు చార్జిషీట్లు దాఖలు చేసిన ఎన్ఐఏ... హమిడాన్ వివరాలు, ఆధారాలు కావాలంటూ గతేడాది ఫిలిప్పీన్స్‌ను కోరిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో ప్రత్యేకించి సోషల్ మీడియాను అడ్డగా చేసుకుని అనేక మంది భారతీయులకు ఆమె వల వేసినట్టు భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. భారత్ సహా పలు దేశాల నుంచి ఐసిస్‌లోకి 'ఫారెన్ ఫైటర్స్'ను రిక్రూట్ చేసుకునేందుకు ఆమె చురుగ్గా వ్యవహారం నడిపినట్టు సమాచారం. కాగా తాము హమిడాన్ ప్రభావం వల్లే ఐసిస్‌లో చేరినట్టు ఇద్దరు భారత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







