ఏపీ తో దుబాయ్ సంస్థల భారీ ఉప్పందం
- October 22, 2017
ఏపీలో ఏరోసిటీ
ముఖ్యమంత్రి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో అవగాహన ఒప్పందం
5.5 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఏవియేషన్ సిటీ ఎల్ ఎల్ పీ సంసిద్ధత
ఇరవై వేల ఉద్యోగావకాశాలు
దుబాయి, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్ లో ఏరోసిటీ దశలవారీగా 5.5 బిలియన్ డాలర్ల పెట్టుబడితో యుఎఇ లోని మహ్మద్ అబ్దుల్ రెహమాన్ మహ్మద్ అల్ జూరానీ కి చెందిన ఏవియేషన్ సిటీ ఎల్ ఎల్ పీ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన ఎకనమిక్ డెలవప్మెంట్ బోర్డుకు, ఏవియేషన్ సిటీ ఎల్ ఎల్ పీకి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఏరో సిటీ పూర్తయితే 15,000 మందికి ప్రత్యక్షంగా, 5,000 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏవియేషన్ సిటీగా నిర్మించే ఏరోసిటీ నిర్మాణంలో అత్యంత అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తారు. దేశవిదేశాల నుంచి విజ్ఞానాన్ని తీసుకురావడం (Knowledge transfer) తమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్న ప్రాజెక్టు అని అన్నారు. ఎక్కడ స్థాపించాలన్నదీ ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. ఏవియేషన్ సిటీ ఎల్ ఎల్ పీ ఏరోసిటీ స్థాపనకు 10 వేల ఎకరాలు అవసరమవుతుందని తెలిపింది. ఈ కంపెనీ బృందం ఈ మేరకు నవంబర్ మూడో వారంలో అధ్యయనానికి మన రాష్ట్రానికి రానున్నది. వచ్చే జనవరిలో దావోస్లో ప్రాథమిక నివేదిక అందజేస్తుంది.


తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







