అమెరికా-మెక్సికో రెండు దేశాల మధ్య గోడ నమునాలు సిద్ధం
- October 23, 2017
అమెరికన్లకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. తనను గెలిపిస్తే మెక్సికో-అమెరికా మధ్య పెద్ద గోడకడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
మొత్తం 8 నమునాలు ఇప్పటికే రూపకల్పన కాగా, వాటిలో ఏదో ఒకదానికి అంగీకారం చెబితే పనులు మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. దక్షిణ కాలిఫొర్నియాలోని శాండియాగో, టిజువానా (మెక్సికో) సరిహద్దుల్లో వీటిని ఏర్పాటుచేశారు. కాంక్రీట్, లోహాంతో కూడిన 9 మీటర్ల వెడల్పుతో 18 నుంచి 30 మీటర్ల ఎత్తు ఉండేలా నిర్మించారు. ఈ గోడపై భాగాన పదునైన కొక్కీలను ఏర్పాటు చేశారు. మధ్యలో ఎలక్ట్రిక్ వ్యవస్థతో కూడిన భద్రత వ్యవస్థ ఉంటుంది.
ఒక్కో నమూనా తయరీకి 5 లక్షల డాలర్లను ఖర్చుచేసినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు 3,146 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇప్పటికే 1,052 కిలోమీటర్ల మేర ఒక వరుస కంచె ఉంది. మరో 82 కిలోమీటర్లు మేర రెండు, మూడు వరుసల కంచె ఏర్పాటు చేశారు. ఈ మొత్తం సరిహద్దును ట్రంప్ ఎత్తైన గోడ కట్టేసి మూసేయాలని భావిస్తున్నారు. దీంతో 18 మీటర్ల నుంచి 30 మీటర్లు ఎత్తు సరిహద్దు గోడ నిర్మించాలంటే అయ్యే ఖర్చును లెక్కలు గడుతున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ‘‘మెక్సికన్లు నేరస్థులు, రేపిస్టులు, డ్రగ్ డీలర్లు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 827 బిలియన్ డాలర్ల ప్యాకేజీతో కేవలం గోడ నిర్మాణంతో కాకుండా.. 10 వేల మందితో బోర్డర్ సెక్యూరిటీ పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వైట్ హౌజ్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







