గోల్డెన్ గాళ్

- April 29, 2015 , by Maagulf
గోల్డెన్ గాళ్

'కెరటం' చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైనా...'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత వెంటవెంటనే 'లౌక్యం, కరెంటుతీగ' చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో రకుల్ గోల్డెన్ గాళ్‌గా మారింది. దీంతో యంగ్ హీరోల సరసన ఆఫర్లు కొట్టేసింది. 'రామ్ (పండగచేస్కో), రవితేజ (కిక్-2), రామ్ చరణ్, ఎన్టీఆర్ (మా నాన్నకు ప్రేమతో), మహేష్ (బ్రహ్మోత్సవం) వంటి స్టార్ హీరోల సరసన నటించేందుకు ఇప్పటికే కమిట్ అయ్యింది. తాజాగా మరో యంగ్ హీరోకు కథానాయికగా నటించే అవకాశం వచ్చిందట. నితిన్ మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడు చెప్పిన స్టొరీ లైన్ కి ఓకే చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నితిన్‌కి జోడీగా రకుల్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. కొన్నాళ్ల క్రితం నితిన్ - శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్‌లో ఓ మూవీ మొదలయ్యి ఆగిపోయింది. ఆ సినిమాలో హీరోయిన్ గా రకుల్‌ని ఎంపిక చేసి నిర్మాతైన నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే ఆ సినిమా ఆగిపోవండంతో నితిన్ - వేణు సినిమాలో రకుల్‌ ప్రీత్ సింగ్‌నే హీరోయిన్‌గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com