దుబాయ్‌లో ఈనెల 27న '2.0' సినిమా ఆడియో వేడుక

- October 25, 2017 , by Maagulf
దుబాయ్‌లో ఈనెల 27న '2.0' సినిమా ఆడియో వేడుక

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన '2.0' సినిమా ఆడియో వేడుక దుబాయ్‌లో ఈనెల 27న అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమం కోసం దుబాయ్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేజ్‌ అలంకరణ ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ అధినేత రాజు మహాలింగం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.
దుబాయ్‌ నగరాన్ని మరో మూడు రోజుల పాటు '2.0' నగరంగా పిలుచుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమల్‌ హాసన్‌ హాజరుకానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ఆడియో వేడుకను నిర్వహిస్తున్నారు. అతిథులకు కేటాయించిన ఒక్కో టేబుల్‌కి రూ.6లక్షలు ఖర్చు చేస్తున్నట్లుతెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ అరగంట పాటు లైవ్‌ ప్రదర్శన ఇవ్వనున్నారు. సినిమాలో కేవలం ఒక్క పాటే ఉందట. మిగతా పాటలను రెహమాన్‌ లైవ్‌ ప్రదర్శన ఇవ్వనున్నట్లు తమిళ వర్గాల సమాచారం.
ఆ తర్వాత నవంబర్‌లో సినిమా ట్రైలర్‌ విడుదల చేస్తారు. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకి జోడీగా అమీ జాక్సన్‌ నటించింది. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. 2018 జనవరిలో ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com