దుబాయ్ గ్లోబల్ విలేజ్ లో పూర్తి భద్రతా ఏర్పాట్లు
- November 06, 2015
75 దేశాల నుండి ఒక మిలియన్ సందర్శకులు విచ్చేసే అవకాసం ఉన్నందున, దుబాయ్ ‘గ్లోబల్ విలేజ్’ లో భద్రతా ఏర్పాట్లను దుబాయ్ పోలీసులు పూర్తి చేసినట్టు, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ - బ్రిగేడియర్ అబ్దుల్లా అల్ ఘైతి తెలిపారు. గత సంవత్సరం ఈ కార్యక్రమాన్ని గురించిన వ్యాఖ్యానాలను, ఈ సంవత్సరం సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ 20 వ సెషన్ లో షాపింగ్, పర్యటన మరియు వినోద కార్యక్రమాల ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఇక్కడ ఒక పిల్లల సంరక్షణా స్థలాన్ని ఏర్పాటు చేసినట్టు, ట్రాఫిక్ జాం లను నివారించడానికి ముఖ్యంగా వారాంతాలలో ప్రజా రవాణా సదుపాయాలను, ట్రాఫిక్ ఏర్పాట్లను చేసినట్టు ఆయన తెలుపుతూ, ఈ సౌకర్యాలను వినియోగించుకుని తమకు సహకరించవలసిందిగా ఆయన ప్రజలను, సందర్శకులను విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







