అరుణాచల్ ప్రదేశ్‌లోని చిన్న నిర్లక్ష్యం.. ఏడుగురి ప్రాణాలను బలితీసుకుంది
- October 29, 2017
మంచుకొండల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు సరుకులు తీసుకెళ్లిన ఓ సైనిక హెలికాప్టర్ అనూహ్యంగా కుప్పకూలడం వెనుక కారణాలు బయటపడ్డాయి. చిన్న నిర్లక్ష్యం.. ఏడుగురి ప్రాణాలను బలితీసుకోవడం చూసి అధికారులు అవాక్కయ్యారు..
అక్టోబర్ 6న ఉదయాన్నే 6 గంటలకు.. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతానికి వెళ్లింది Mi 17 వీ ఫైవ్... హెలికాప్టర్. 17 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ.. కొండలపై ఉన్న సైనిక శిబిరాల దగ్గర కిరోసిన్ క్యాన్లను ప్యారాచూట్ల సాయంతో కిందకు విడిచింది. ఈ సమయంలో ఓ కిరోసిన్ క్యాన్ ప్యారాచూట్.. హెలికాప్టర్ టెయిల్ రూటర్‌కు తట్టుకుంది. దీంతో రూటర్ జామ్ అయ్యి.. హెలికాప్టర్ కిందకు కూలిపోయింది.
సాధారణంగా సరుకులను కిందకు దించే సమయంలో హెలికాప్టర్‌ను ఓ ప్రాంతంలో నిలిపి కిందకు వేస్తుంటారు. కానీ.. తవాంగ్‌లో మాత్రం వేగంగా ముందుకు సాగుతూ క్యాన్లను కిందకు విసిరారు. వేగంగా గాలులు వీయడంతో.. ఓ ప్యారాచూట్.. హెలికాప్టర్ తోకకు తగలడంతో.. ఒక్కసారిగా అదుపు తప్పింది. అంతా చూస్తుండగానే.. కొండల్లో కూలిపోయింది. అందులో ఉన్న ఏడుగురు సిబ్బంది ప్రాణాలను బలితీసుకుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!