కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త
- October 29, 2017
కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రైల్వేశాఖ 15 వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి కొత్తగా పదివేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు. ఆగస్టు నెలలో రైల్వేశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పీయూష్ గోయల్ మాట్లాడుతూ అదనపు పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు పెంచుతామని ప్రకటించారు. ముంబైలో రైల్వేమంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. దేశంలో రైల్వేలైన్ల విద్యుదీకరణను వేగిరం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. పదేళ్లలో చేయాలనుకున్న విద్యుదీకరణ ప్రాజెక్టులను నాలుగేళ్లలో పూర్తి చేయడం ద్వారా 30 శాతం వ్యయాన్ని తగ్గిస్తామన్నారు. విద్యుదీకరణ ప్రాజెక్టుల వల్ల ఏటా పదివేల కోట్ల రూపాయల ఇంధన వ్యయాన్ని రైల్వేకు తగ్గించవచ్చన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!