సన్యాసిగా మారిన విజువల్ గ్రాఫిక్స్‌ 'లోకేష్'

- October 29, 2017 , by Maagulf
సన్యాసిగా మారిన విజువల్ గ్రాఫిక్స్‌ 'లోకేష్'

జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో తనకు ఎదురయ్యే కష్టాల నుండి తప్పించుకుని సన్యాసం తీసుకుంటే బావుంటుందని అనుకుంటారు. కానీ బంధాలు.. బాధ్యతలు.. ఆశలు.. కోర్కెలు.. వెనక్కి లాగేస్తుంటాయి. కానీ వీటన్నింటిని తృణప్రాయంగా భావించి సన్యాసం స్వీకరిస్తున్న వారు ఇటీవల వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. మొన్నామధ్య భార్యాభర్తలు కోట్ల ఆస్తిని, ఆఖరికి పేగుబంధాన్ని కూడా వదులుకుని సన్యాసం స్వీకరించారు. ఇప్పుడు అదే కోవకి చెందిన మరో వ్యక్తి పేరు వినిపిస్తోంది. ఛత్తీస్‌ఘడ్‌లోని జగదల్‌పూర్‌కు చెందిన లోకేష్ గోల్చా. ఇతడు అమెరికాలో ఓ పెద్ద గ్రాఫిక్ డిజైనింగ్ సంస్థకు అధిపతి.  తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు.  బంధువుల సాయంతో చదువుకుంటూ విశాఖపట్నంలోనే విజువల్ గ్రాఫిక్స్‌లో డిప్లమో పూర్తి చేశాడు.  అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో ప్రముఖ కంపెనీ భాగస్వామ్యంతో గ్రాఫిక్ డిజైనింగ్ స్టూడియోను స్థాపించే స్థాయికి ఎదిగాడు. ఇదిలా ఉండగా జైన ముని పియూష్ సాగర్ ఉపన్యాసాలకు లోకేష్ ప్రభావితుడయ్యాడు. సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. నవంబరు 15న తన గురువు నుంచి దీక్ష తీసుకోనున్నారు లోకేష్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com