భార్య, సోదరితో కలిసి కిమ్ టూర్
- October 30, 2017
సియోల్: అమెరికాపై వరుస హెచ్చరికలకు పాల్పడుతున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కాస్త విరామం తీసుకున్నట్లు కన్పిస్తోంది. నిన్నమొన్నటి వరకు అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలతో బిజీబిజీగా ఉన్న కిమ్.. తాజాగా తన భార్య, సోదరితో కలిసి టూర్‌కు వెళ్లారు. ప్యాంగ్యాంగ్‌లోని ఓ సౌందర్య ఉత్పత్తుల ఫ్యాక్టరీకి వెళ్లిన ఆయన అక్కడి సదుపాయాలను పరిశీలించారు.
కిమ్ తన భార్య రి సోల్ జు, సోదరి కిమ్ యో జాంగ్‌తో కలిసి ప్యాంగ్యాంగ్ కాస్మెటిక్స్ ఫ్యాక్టరీని సందర్శించినట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా వెల్లడించింది. భార్యతో కలిసి ఉన్న కిమ్ చిత్రాన్ని ప్రచురించింది. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాన్యంపై కిమ్ ప్రశంసల వర్షం కురిపించారట. మహిళల కలలను నిజం చేసే ఉత్పత్తులను తయారు చేస్తున్నారంటూ తెగ పొగిడారట.
ఉత్తరకొరియాను కొన్ని దశాబ్దాల నుంచి కిమ్ వంశస్థులే పాలిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారి కుటుంబసభ్యుల, వ్యక్తిగత వివరాలు మాత్రం బయటి ప్రపంచానికి అంతగా తెలియవు. కిమ్ భార్య రి కూడా అడపాదడపా మాత్రమే మీడియాకు కన్పిస్తుంది. ఇటీవలే కిమ్ సతీమణి మూడో సంతానానికి జన్మనిచ్చినట్లు వార్తలు వచ్చాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!