తమిళనాడుకు భారీ వర్షసూచన

- October 30, 2017 , by Maagulf
తమిళనాడుకు భారీ వర్షసూచన

చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైతో పాటు ఎనిమిది తీర ప్రాంత జిల్లాల్లో రాబోయే 24గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సోమవారం వాతావరణ శాఖ హెచ్చరించింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం ఉదయానికి తీవ్రరూపం దాల్చింది.
రాబోయే 5రోజులపాటు (శుక్రవారం)వర్షాలు కొనసాగుతాయని,నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన అధిక పీడనమే వర్షాలకు కారణమని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
ఈ ప్రభావం వల్ల చెన్నై, కడలూరు, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, నాగపట్టణం, తంజావూర్‌, తిరువారూర్‌, రామనాథపురం తదితర ప్రాంతాల్లో మరో 24గంటల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అక్టోబర్‌ 27న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయని వాతావరణశాఖ తెలిపింది. డిసెంబర్‌ మొదటి వారం వరకు వర్షాలు కొనసాగుతాయని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com