తమిళనాడుకు భారీ వర్షసూచన
- October 30, 2017
చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైతో పాటు ఎనిమిది తీర ప్రాంత జిల్లాల్లో రాబోయే 24గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సోమవారం వాతావరణ శాఖ హెచ్చరించింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం ఉదయానికి తీవ్రరూపం దాల్చింది.
రాబోయే 5రోజులపాటు (శుక్రవారం)వర్షాలు కొనసాగుతాయని,నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన అధిక పీడనమే వర్షాలకు కారణమని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
ఈ ప్రభావం వల్ల చెన్నై, కడలూరు, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, నాగపట్టణం, తంజావూర్, తిరువారూర్, రామనాథపురం తదితర ప్రాంతాల్లో మరో 24గంటల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అక్టోబర్ 27న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయని వాతావరణశాఖ తెలిపింది. డిసెంబర్ మొదటి వారం వరకు వర్షాలు కొనసాగుతాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!