మైనర్‌తో పెళ్ళి: ఇండియలో బహ్రెయినీ అరెస్ట్
- October 30, 2017
హైదరాబాద్: బహ్రెయినీ జాతీయుడొకరు ఇండియాలో అక్రమంగా మైనర్ బాలికని వివాహం చేసుకుంటుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గతవారం బహ్రెయిన్ నుంచి వచ్చిన వ్యక్తి, తలాబ్కట్టకి చెందిన ఓ బాలికను వివాహం చేసుకున్నాడు. ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని పోలీస్ టీమ్, నిందితుడి మూమెంట్స్‌ని ఎప్పటికప్పుడు పరిశీలించి, వ్యూహాత్మకంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మ్యారేజ్ సర్టిఫికెట్, కొంత డబ్బు, పాస్‌పోర్ట్ ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా తెరపైకొస్తున్నాయి. 16 ఏళ్ళ బాలికల్ని 60 ఏళ్ళకు పైబడిన వృద్ధులు పెళ్ళి చేసుకుని జిసిసి దేశాలకు తీసుకెళుతున్నారు. వారిలో చాలామంది తీవ్ర హింసల్ని ఎదుర్కొంటున్నట్లు పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!