కేరళలో కుప్పకూలిన ఐరన్ బ్రిడ్జి.. ఒకరు మృతి, 57మందికి గాయాలు

- October 30, 2017 , by Maagulf
కేరళలో కుప్పకూలిన ఐరన్ బ్రిడ్జి.. ఒకరు మృతి, 57మందికి గాయాలు

కేరళలో భారీ ప్రాణ నష్టం తప్పింది. భారీ వంతెన కుప్పకూలి.. ఒకరు చనిపోయారు. 80మందికి పైగా నదిలో కొట్టుకుపోయారు. చివరకు తీవ్ర గాయాలతో ఈదుకుంటూ వారంతా ఒడ్డుకు చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. కొల్లం శివారులోని చవారా ప్రాంతంలోని పురాతన వంతెన ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది. 

పురాతన బ్రిడ్జి కూలడంతో ఒకరు మృతి చెందగా, మరో 57 మంది గాయపడ్డారు. స్థానికులు మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో బ్రిడ్జి ఒక్కసారిగా కుప్ప కూలింది. ఘటన సమయంలో బ్రిడ్జిపై దాదాపు 80 మంది వరకు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొందరు ఈత కొడుతూ బయటకు వచ్చినప్పటికీ…. ఇనుప బ్రిడ్జి కావడంతో, చాలా మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించారు. ఈ బ్రిడ్జి చాలా పురాతనమైనదని, తుప్పు పట్టడంతో దీనిపై రాకపోకలు నిలిపివేయాలని చాలా రోజుల క్రితమే కోరినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అధికారులు ఎలాంటి మరమ్మత్తులు చేయకపోవడం, రాకపోకలు నిషేదించకపోవడంతో ప్రమాదం జరిగిందంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com