ఇటలీలో పరిస్థితిని సమీక్షిస్తున్న సుష్మా
- October 31, 2017
మిలాన్: ఇటలీలోని మిలాన్‌లో భారతీయ విద్యార్థులపై దాడి జరిగింది. ఈ మేరకు మిలాన్‌లో భారత కాన్సులేట్ వెల్లడించింది. అయితే విద్యార్థులు ఆందోళన చెందొద్దని, ఘటనపై విచారిస్తున్నామని తెలిపింది.
ఈ ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా స్పందించారు. 'దాడిపై అన్ని వివరాలను తెలుసుకున్నాను. విద్యార్థులు కంగారుపడొద్దు. వ్యక్తిగతంగా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాను' అని సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు.
అంతకుముందు 'మిలాన్‌లో కొందరు భారతీయ విద్యార్థులపై దాడి జరిగినట్లు కాన్సులేట్‌కు నివేదికలు వచ్చాయి. అయితే దీనిపై మిగతా విద్యార్థులు ఆందోళన చెందవద్దు. ఘటన గురించి సంబంధిత అధికారులతో చర్చిస్తున్నాం' అని మిలాన్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తమ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
అయితే ఈ దాడులు ఎవరిపై, ఎందుకు జరిగాయో అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. భారత విద్యార్థులు బయటకు వెళ్లినప్పుడు ఒకరితో ఒకరు సంప్రదించుకోవాలని కాన్సులేట్ జనరల్ సూచించింది. విద్యార్థులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!