దుబాయ్ లో నకిలీ వైద్య నివేదిక జారీ చేసిన భారతీయ వైద్యుడికి జైలుశిక్ష : దేశ బహిష్కరణ
- October 31, 2017_1509460701.jpg)
దుబాయ్ : నకిలీ వైద్య నివేదికను రూపొందించి నిందితులకు జారీ చేసిన నేరానికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఓ 42 ఏళ్ళ భారతీయ వైద్యునికి ఆరు నెలలు జైలు శిక్ష అనంతరం దేశ బహిష్కరణ విధిస్తూ, కోర్టు అఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ తీర్పు ఇచ్చింది. ఈజిప్ట్ కు చెందిన ఇరువురు సోదరులు 26 ఏళ్ళ ఆడిటర్, 32 ఏళ్ళ ఒక మేనేజర్,ఇద్దరూ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు. వారికి మద్దతుగాఒక నకిలీ నివేదికకు సమర్పించి కేసుని తప్పుదోవ పట్టించిన వైద్యుడు సైతం ఈ కేసులో అనూహ్యంగా ఇరుక్కున్నాడు. కోర్టు వీరందరిని దోషులుగా నిర్ధారించారు. వాస్తవానికి, వైద్యపరంగా నియంత్రణలో ఉన్న వెన్నునొప్పికి సంబంధించిన మందులను చట్టవిరుద్ధమైన ఉపయోగం కోసం ఒక తప్పు సమర్థన చేసిన భారతీయ వైద్యుడి ఈ కేసులో అడ్డంగా దొరికిపోయాడు.. ఆడిటర్ నకిలీ నివేదికను ఉపయోగించారు. న్యాయస్థానం విచారణ జరిగే సమయంలో ప్రజా విచారణ సభ్యుడికి ఆ నకిలీ వైద్య నివేది సమర్పించారు. వైద్యుడు తప్పుగా వైద్య సూచనను చేయడమే కాక ఆయన రాసిన మందులు ఆరోగ్య మంత్రిత్వశాఖ నియమించిన నిబంధనలకు అనుగుణంగా లేదు. ఈ ముగ్గురు శిక్ష అనుభవించిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. ఒక క్రిమినల్ కేసుకు సంబంధించిన ఈజిప్ట్ సోదరులకు ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. వారికి నకిలీ వైద్య నివేదిక ఇచ్చి భారతీయ వైద్యుడు బలి పశువుగా మారేడు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!